![]() |
![]() |

కూకు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో చూస్తే భలే ఫన్నీగా ఉంది. ఫారెస్ట్ థీమ్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇందులో కంటెస్టెంట్స్ అంతా రకరకాల గెటప్స్ వేసుకుని వచ్చారు. ఇక రీతూ చౌదరి తేనెటీగ గెటప్ వేసుకొచ్చింది. "హనీ బీ వాలాలంటే అందమైన ఫ్లవర్ ఉండాలి. అందుకే వాలడానికి వచ్చేసాను" అంటూ డీమన్ పవన్ తో కలిసి ఒప్పుల కుప్ప తిరిగింది రీతూ. "ఆయన్ని ఫ్లవర్ అంటున్నవ్ ఫైర్ అని తెలీదా " అని ప్రదీప్ అడిగాడు. "మా వాడు ఫ్లవర్ కానీ ఎప్పుడూ ఫైర్ " అని చెప్పింది రీతూ. టార్జాన్ గా ఇమ్మానుయేల్ చేసాడు.
"బేసిక్ గా మీరు ఎక్కడుంటారు " అని ప్రదీప్ అడిగాడు. "నేను ఇక్కడే అడవిలో ఉంటాను"అన్నాడు. "డైలీ ఎం చేస్తారు సర్" "రోజూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు దూకుతా ఉంటాను" " ఎం పని సర్ ఎందుకు దూకుతున్నారు" " పని లేకే దూకుతా ఉన్నాను " అన్నాడు ఇమ్మానుయేల్. ఇందులో పుష్ప మూవీ గెటప్స్ వేసుకొచ్చారు.
అవినాష్ షెకావత్ గా, రోహిణి దాక్షాయణిలా, పుష్ప గెటప్ లో మణికంఠ వచ్చాడు. ఇక గోమతి ఐతే గూడెంలో ఉండే అమ్మాయి గెటప్ లో వచ్చింది. నేను ఆయన గుండెల్లో ఉంటాను అంటూ ప్రదీప్ ని చూపించేసరికి అతను భయపడిపోయాడు. ఇక సుహాసిని గన్ పట్టుకుని వచ్చి "నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది " అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేసరికి అవినాష్ వచ్చి "భయపడకండి తిక్కలది వచ్చింది " అనేసరికి సుహాసిని షాకయింది.
![]() |
![]() |